Thursday, 5 November 2026

ట్రాక్టర్ యజమానులకు డ్రైవర్లకు అవగాహన సదస్సు

 

కేజీ వీల్స్ లతో రోడ్డు పైకి వస్తే కఠిన చర్యలు మంచిర్యాల ఎం వి ఐ రాహుల్ కుమార్

 

జనంసాక్షి దండేపల్లి27 ట్రాక్టర్ డ్రైవర్లు కేజీ వీల్స్ తో డ్రైవింగ్ లైసెన్స్ వాహన పత్రాలు లేక రోడ్డుపైకి వస్తే కఠిన చర్యలు తప్పవు అని మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ రాహుల్ కుమార్ అన్నారు మంగళవారం స్థానిక పోలీస్ స్టేషన్ ముందు

జిల్లా కలెక్టర్ మరియు ఆర్టీవో కిష్టయ్య ఆదేశాల మేరకు  ఎంవిఐ E రాహుల్ కుమార్ మరియు వారి సిబ్బందితో కలిసి దండేపల్లి మండలాలలో తనిఖీలు నిర్వహించి కేజీ వీల్ ట్రాక్టర్ ఓనర్ లు మరియు రైతులతో సమావేశం నిర్వహించి పొలాల దుక్కిల్ల సీజన్ మొదలైనందున ట్రాక్టర్లకు కేజీ వీల్స్ బిగించినప్పుడు  బీటీ రోడ్లపై నడప రాదని వాటికి సేఫ్టీ ప్యాచ్చ్ వేయించుకోవాలని, లేదా కేజ్ వీల్స్ పొలంలోనే బిగించుకోవాలని,  లేని పక్షంలో అట్టి ట్రాక్టర్లను  సీజ్ చేయడం జరుగుతుందని,  అనాథరైజ్డ్ ఆల్టరేషన్, ప్రివెన్షన్ ఆఫ్ డామేజ్ టు పబ్లిక్ ప్రాపర్టీస్ ఆక్ట్ కింద కేసులు బుక్ చేసి పెనాల్టీ విధించడంతో పాటు చార్జ్ షీట్ వేసి జైలుకు పంపించడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దండేపల్లి మండలం ట్రాక్టర్ ఓనర్లు, రైతులు పాల్గొన్నారు