ట్రాన్స్ ఫార్మర్స్ కాయిల్స్ దొంగల అరెస్ట్

– నిందితుల నుంచి రెండు ఆటోలు, రూ.4.84లక్షలు స్వాదీనం
– సంగారెడ్డి జిల్లా ఎస్పీ రమణకుమార్
 సంగారెడ్డి టౌన్ జనం సాక్షి
మూతపడిన పరిశ్రమల్లో ఉన్న ట్రాన్స్ఫార్మర్స్, వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్ల నుంచి దొంగతనంగా కాపర్ కాయిల్స్ దొంగలిస్తున్న ఏడు మంది దొంగలను సంగారెడ్డి జిల్లా పోలీసులు అరెస్టు చేశారు.  బుధవారం జిల్లా ఎస్పీ రమణ కుమార్ సంగారెడ్డి లోని జిల్లా పోలీస్ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి దొంగతనానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ
గత సంవత్సర కాలం నుండి సంగారెడ్డి జిల్లాతో పాటు   ప్రక్కన ఉన్న జిల్లాలో గల మూతబడిన పరిశ్రమలు మరియు వ్యవసాయ భూముల వద్ద ఉండే ట్రాన్స్ ఫార్మర్ల నుంచి కాఫర్ వైర్లు ఒక ముఠాగా ఏర్పడి దొంగతనానికి పాల్పడుతున్నట్లు తెలిపారు.  ముఖ్యంగా సంగారెడ్డి జిల్లాలో గల పారిశ్రామిక ప్రాంతాలైన ఐ‌డి‌ఏ బొల్లారం పోలీస్ స్టేషన్, పటాన్ చెరు పోలీస్ స్టేషన్, బీడీఎల్. భానూర్ పోలీస్ స్టేషన్ మరియు ఇంద్రకరణ్ పోలీస్ స్టేషన్ పరిధి లోని  పారిశ్రామికవాడలలో ఉన్న లాక్ అవుట్ అయిన ఫ్యాక్టరీలలోని  ట్రాన్స్ ఫార్మర్లు  మరియు జహీరాబాద్ డివిజన్ లో గల కోహీర్, జహీరాబాదు రూరల్, చిరాగ్ పల్లి, ఝరాసంగం, రాయికోడ్, హద్నూర్  పోలీస్ స్టేషన్ ల  పరిధిలో గల   వ్యవసాయ భూముల వద్ద గల ట్రాన్స్ ఫార్మర్లను ఎంచుకొని అందులో ఉన్న కాపర్ కాయిల్స్ లను ఎవరో గుర్తు తెలియని దొంగలు దొంగిలించుకుని పోతున్నట్లు పలు ఫిర్యాదులు అందయన్నారు.  సుమారుగా ఈ జిల్లాలో గత సంవత్సర కాలం నుండి 26 కేసులు నమోదు అయినట్లు తెలిపారు.
ఈ నేరాలు  మళ్ళీ జిల్లాలో జరగకుండా ఉండాలని ఈ నేరాలు జరుగుచున్న ప్రాంతంలో ఉన్న  పోలీసు అధికారులకు నైటు పెట్రోలింగ్ ను ముమ్మరం చేయమని మరియు రాత్రి సమయములో వాహనాలు తనిఖీ చేయాలని అందరికి ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. ఇందులో భాగంగానే తేది 19,20వ తేదీ రాత్రి ఐడియా బొల్లారం సిఐ సురేందర్ రెడ్డి, జిన్నారం సీఐ వేణు కుమార్ మరియు గుమ్మడిదల SI  విజయక్రిష్ణ, మరియు వారి సిబ్బంది కలసి గడ్డపోతారం నుండి జిన్నారం వచ్చే దారిలో వాహనాలను తనిఖీ చేయుచుండగా అర్ధరాత్రి దాటినాక ఒక అశోక్ లేలాండ్ మినీ ట్రాలీ మరియు రెండు బజాజ్ ఆటోలలో ఏడుగురు వ్యక్తులు అక్కడికి రాగా అట్టి వాహనాలను మా సిబ్బంది తనిఖీ చేయగా   ట్రాలీలో ఒక ట్రాన్స్ ఫార్మర్ కు సంబంధించిన కాపర్ కాయిల్స్ ఉన్నవని గమనించి, వారిని విచారించగా వారు ఏడుగురు వాళ్ళతో పాటుగా ఇంకా 12 మంది వ్యక్తులు రెండు ముఠాలుగా ఏర్పడి సుమారుగా ఈజిల్లాలో జరిగినటువంటి ట్రాన్స్ ఫార్మర్ కాపర్ కాయిల్స్ దొంగతనాలు మరియు వికారాబాదు జిల్లలో పెద్దేముల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల జరిగిన దొంగతనాలు తామే చేసినామని అంగీకరించాలని తెలిపారు.  ఈ దొంగతనాలు చేసే క్రమంలో ఎవరైనా వారిని అడ్డగిస్తే అలాంటి వారిపై  గొడ్డళ్ళతో  దాడి చేసి వారిని గాయపరచి, అవసరమైతే వారిని చంపైనా వారియొక్క దొంగసొత్తును ఎత్తుకోని వెళ్తామని దొంగలు ఒప్పుకున్నారని వివరించారు. ఇలా దొంగిలించిన కాపర్ కాయిల్స్ ను జహీరాబాద్ లో, పటాన్ చెరులో, బల్కంపేట హైదరాబాదులో అమ్ముకుంటామని తెలిపారని,   ఈరోజు కూడా అట్లా దొంగిలించిన కాపర్ కాయిల్స్ ను హైదరాబాదులో అమ్ముకుందామని వెళ్ళుచుండగా అరెస్టు చేయడం జరిగిందన్నారు. దొంగతనాలకు పాల్పడుతున్న వారిలో మెకానిక్ మేఘావత్ రవి ఆధ్వర్యంలో బానోత్ శ్రీకాంత్ ,సభావత్ పండరి, సాయికుమార్ ,పవర్ లక్ష్మణ్, సయ్యద్ మియా ,ఫిరంగి గోపాలులను అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు. వారి నుంచి దొంగతనానికి ఉపయోగించే సామాన్లు ఒక ఆటో ట్రాలీ ,రెండు ఆటోలు, వారి వద్ద ఉన్న రూ.4.80 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.పరారీలో ఉన్న మరో 12 నేరస్తుల కోసం గాలింపు చేపట్టినట్లు ఎస్పీ తెలిపారు.
ఈ కేసులను చాకచక్యంగా చేదించిన పటాన్ చెరు డీఎస్పీ భీమ్ రెడ్డి మరియు సీఐలు సురేందర్ రెడ్డి, వేణుకుమార్, ఎస్ఐ జయక్రిష్ణ లను ఎస్పీ అభినందించారు.