Monday, 2 November 2026

ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలి

మేడ్చల్‌,నవంబర్‌4 (జనంసాక్షి) : వాహనదారులు ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి సూచించారు. గతంలో పొల్చుకుంటే తెలంగాణ ప్రభుత్వంలో రోడ్డు ప్రమాదాలు చాలా వరకు తగ్గాయన్నారు. ట్రాఫిక్‌ నిబంధనలు పాటిస్తే ఎలాంటి ప్రమాదాలు జరుగవని, వాహనాదారులు విధుల్లో ఉన్న ట్రాఫిక్‌ సిబ్బందికి సహకరించాలని అన్నారు. చౌరస్తాలో ట్రాఫిక్‌ సిగ్నల్‌ లేక వాహనదారులు అనేక ఇబ్బందులు పడ్డారని, ఇప్పుడు కష్టాలు తొలిగిపోయాయని చెప్పారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో అన్ని
రంగాల వారికి న్యాయం జరుగుతుందని తెలిపారు. జాతి నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, దేశ సమగ్రతను కాపాడంతో పాటు ప్రతి ఒక్కరూ దేశాభివృద్ధిలో పాలుపంచుకోవాలన్నారు. అభివృద్ధిలో భాగంగా ప్రభుత్వాలు చేపట్టే కార్యక్రమాలతో పాటు సంస్థలు, వ్యక్తులు పాలుపంచుకొని విద్య, పేదరికం, స్వచ్ఛత కార్యక్రమాల్లో సహకారం అందించాలని సూచించారు.