Monday, 2 November 2026

రోడ్లపై చెత్త వేస్తే జరిమానా

అధికారులకు కలెక్టర్‌ ఆదేశాలు
వనపర్తి,నవంబర్‌4 (జనంసాక్షి) : ఇకపై రోడ్లపై చెత్త వేస్తే జరిమానా విధించాలని కలెక్టర్‌ శ్వేతామొహంతి మున్సిపల్‌ కమిషనర్‌, వార్డుల ఇన్‌చార్జిలను ఆదేశించారు.  వార్డుల వారీగా కలెక్టర్‌ సవిూక్షను నిర్వహిస్తూ ఖాళీ స్థలాల్లో తీసిన చెత్త తరలింపునకు వాడిన ట్రాక్టర్ల వివరాలు, జేసీబీ వివరాలను అడిగి తెలుసుకున్నారు. రహదారులపై, వీధులలో ఎవరైనా చెత్త వేసినట్లయితే వారికి పెనాల్టీ విధించాలని ఆదేశాలు జారీ చేశారు. పట్టణంలో చేపలు, కూరగాయలు, మటన్‌ వంటి వ్యర్థాల సేకరణకు ఆయా మార్కెట్ల వద్ద నిత్యం సాయంత్రం ఒక ట్రాక్టర్‌ను ఏర్పాటు చేయాలని కమిషనర్‌కు సూచించారు. చేపలు, కూరగాయలు, మటన్‌ వేసేందుకు అక్కడ చెత్త కుండీలను ఏర్పాటు చేయాలన్నారు. ఆయా వార్డులలో చెత్త వేసిన వారికి జరిమానా విధించడం జరిగిందని వార్డుల ఇన్‌చార్జిలు కలెక్టర్‌కు వివరించారు. 9పరిశుభ్రత కార్యక్రమాలకు డోజర్‌ పంపించాలని ఆదేశించారు. నాగవరం, రాజనగరం వేళ్లే రహదారుల ఇరువైపులా కల్యాణ మండపాలు, ¬టళ్లు తదితర వాటి నుంచి వెలువడే చెత్తను తొలగించాలని సంబంధిత వార్డు ఇన్‌చార్జి ని ఆదేశించారు. అదేవిధంగా అంబేద్కర్‌ చౌరస్తా నుంచి గోపాల్‌పేట వేళ్లే రహదారి, గాంధీచౌక్‌ రహదారిపై ఉండే చిన్న చిన్న డబ్బాలు, ¬టళ్లు, కిరాణ షాపుల నుంచి ఎవరికైనా రోడ్లపై చెత్త వేస్తే వెంటనే జరిమానా విధించాలని ఆదేశించారు.