కేశవపట్నం ఎస్ఐ
జనంసాక్షి, శంకరపట్నం, అక్టోబర్ 20
ట్రాఫిక్ నిబంధనలు ప్రతి ఒక్కరు పాటించాలని కేశవపట్నం ఎస్ఐ పేర్కొన్నారు. కేశపట్నం మండల ప్రజలకు, వాహనదారులు
వాహనాలకు నెంబర్ ప్లేట్ లేకుండా, అసంపూర్ణంగా నెంబర్ కలిగిన వాహనాలను నడుపుతున్న వాహనాలను సీజ్ చేసి అట్టి వాహన యజమానిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. Highway పై వెళ్తున్న ద్విచక్ర వాహనము నడుపు వారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించవలెను. ఫోర్ వీలర్ నడుపు వాహనదారులు తప్పనిసరిగా సీట్ బెల్ట్ ధరించాలన్నారు.
వాహనదారులు తప్పనిసరిగా వాహనం యొక్క సరైన ధ్రువీకరణ పత్రాలు కలిగి ఉండవలెను
మద్యం సేవించి వాహనాలను నడపరాదు
వాహనంలను అతి వేగంగా అజాగ్రత్తగా నడిపి ప్రమాదాలకు గురికావద్దు వివరంచారు.
రోడ్డుపై రాంగ్ రూట్ లో వాహనంలో నడిపి ప్రమాదాలకు గురికావద్దు
రోడ్లపై వాహనాలను నిలిప రాదు
వాహనదారుడు తమ వాహనంను నడుపుతున్నప్పుడు ఇండికేటర్లను, హెచ్చరిక బోర్డులను అనుసరిస్తూ రోడ్డు ప్రమాదంలు జరగకుండా చూసుకోవలన్నారు.
ప్యాసింజర్ వాహనలలో పరిమితులు మించి ప్యాసింజర్ ని కలిగి వాహనాలు నడపి నిబంధనలను ఎవరైనా ఉల్లంఘించిన ఎడల వారిపై చట్టపైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.




