Thursday, 5 November 2026

భారత్ జోడో యాత్రను విజయవంతం చేద్దాం

..నియోజకవర్గ యువజన కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ యండి.వహీద్
పానుగల్ అక్టోబర్20( జనంసాక్షి) యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశంలో భారత్ జోడో యాత్రను విజయవంతం చేయాలని నియోజకవర్గ యువజన కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ యండి.వహీద్ కోరినట్లు ఒక ప్రకటనలో తెలిపారు.
 ఈ సందర్భంగా నియోజకవర్గ యువజన కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ యండి.వహీద్ మాట్లాడుతూ కొల్లాపూర్ లో జరిగిన  నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశంలో,రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడోయాత్ర గురించి,యువజన కాంగ్రెస్ కార్యకర్తలకు జిల్లా యువజన కాంగ్రెస్ నాయకులు దిశానిర్దేశం చేయడం జరిగిందని తెలిపారు. భారత్ జోడో యాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారత్ జోడో యాత్ర గోడ పత్రిక విడుదల చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కొడిదెల రాము, జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి,కొల్లాపూర్ తాలుక ఇంఛార్జ్ మిద్దె మల్లేష్,పిసిసి ఆర్గనైజింగ్ సెక్రటరి రంగినేని జగదీశ్వర్,జిల్లా ఓబిసి సెల్ అధ్యక్షులు రాము యాదవ్, తాలుక కార్యదర్శి శివప్రసాద్, మండల అధ్యక్షులు, టౌన్ అధ్యక్షులు, వివిధ మండలాల యువజన కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.