ట్రాఫిక్ నియంత్రణ పరికరాల బహుకరణ
సూర్యాపేట (జనంసాక్షి): నారాయణ విద్యాసంస్థల ఏజీఎం వెంకట రమణారెడ్డి , రీజనల్ ఇంఛార్జి రమేష్ రెడ్డిల ఆధ్వర్యంలో పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణ కోసం సుమారు రెండు లక్షల యాబై వేల రుాపాయల విలువ గల 20 ఐరన్ స్టాపర్లను సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్ కు గురువారం బహుకరించారు.ఈ సందర్భంగా జిల్లా పోలీస్ యంత్రాంగం తరుపున సూర్యాపేట డీఎస్పీ పరికె నాగభూషణం వారిని అభినందించి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో
నారాయణ కళాశాల ప్రిన్సిపల్ పుష్పలత , అడ్మనిస్ట్రేటివ్ ఆఫీసర్ రెహముద్దిన్ , పట్టణ సిఐ రాజశేఖర్, ఎస్ఐలు క్రాంతి కుమార్ , శ్రీనివాస్, సైదులు, యాకుబ్ , జహాంగీర్, నారాయణ కళాశాల స్టాఫ్ సతీష్ , రవీందర్ రెడ్డి, సరిత, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.