Thursday, 5 November 2026

ట్రాఫిక్ సమస్య పై ఉన్నతాధికారులు పర్యటించడం ప్రసంశనీయo జంపన ప్రతాప్

 సికింద్రాబాద్ న్యూ బోయినపల్లి అక్టోబర్ 20 జనం సాక్షి సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డ్ పరిధిలోని ప్రధాన కూడళ్లల్లో ట్రాఫిక్ సమస్య ఏర్పడకూడా  ట్రాఫిక్ విభాగం ఉన్నతాధికారులు పర్యటించి క్షేత్ర స్థాయిలో సమస్యలు గుర్తించి పరిష్కారం కోసం చర్యలు తీసుకోవడం ప్రసంశనీయమన్ని బోర్డ్ మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ పేర్కొన్నారు. బోయిన్ పల్లి చౌరస్తా,
 బోయిన్ పల్లి బస్ స్టాప్, బాపూజీనగర్, సెంటర్ పాయింట్ ఇతర ప్రాంతాల్లో ట్రాఫిక్ అదనపు డీసీపీ రంగారావు, ఏసీపీ గంగారెడ్డి, తిరుమలగిరి ట్రాఫిక్ సిఐ పురుషోత్తం రావు ఇతర సిబ్బంది పర్యటించారు, ఈ సందర్భంగా జంపన ప్రతాప్ ట్రాఫిక్ అధికారులను కలిసి పలు సమస్యలతో పాటు ట్రాఫిక్ సిబ్బంది పేద ప్రజలను చిరు వ్యాపారులకు వేదింపులకు గురి చేస్తున్నారని చాలన్లు వేస్తున్నారన్ని వారికి తెలిపారు, ట్రాఫిక్ ఇబ్బంది  కలగకుండా  తగిన చర్యలు తీసుకుంటున్నామన్ని బస్ స్టాప్ ల్లో రోడ్ల పై ఆటోఇతర వాహనాలు తోపుడు బండ్లు లేకుండా చూడాలని అధికారులు  కోరైనన్నారు జంపన ప్రతాప్ తెలియజేశారు నిజానికి బోర్డ్ పరిధిలో  కూడాళ్ళు విస్తరణకు బోర్డ్ అధికారులు నిర్ణయించినప్పటికీ సక్రమంగా అమలు కాలేదని అన్నారు, ఇక డైమండ్ పాయింట్ వద్ద ఉన్న గాయత్రి గార్డెన్ యాజమాన్యం స్థలం ఇచ్చేందుకు ముందుకు వచ్చిన ప్పటికీ ట్రాన్స్ఫార్మర్ తొలగించడంలో ఆలస్యం జరిగి దీనివలన ఫ్రీ లెఫ్ట్ కు ఇబ్బంది జరుగుతోందని అన్నారు, బోర్డ్ సీఈఓ, బ్రిగేడియర్  ట్రాఫిక్ ఉన్నతాధికారులు కలిసి కీలక నిర్ణయం తీసుకొని ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటే తన వంతుగా సహాకారం అందజేస్తామని జంపన ప్రతాప్ తెలిపారు.