చేవెళ్ల జూలై 23(జనంసాక్షి) ఏడతెరిపి లేకుండ కురుస్తున్న వర్షాలకు వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని చేవెళ్ల ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గోపగాని గురువయ్య గౌడ్ అన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఏడ తెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నందున వాహనదారులు వాహనాలను జాగ్రత్తగా నడపాలని, అతివేగంగా నడపవద్దని సూచించారు. వర్షాలు ఎక్కువగా కురుస్తున్నందున వాహనాలు నడిపేటప్పుడు సడన్ బ్రేక్ లు వేయకూడదన్నారు. వర్షం వలన రోడ్లు తడిసి ఉన్నందున వాహనాలు స్కిడ్ అయి ప్రమాదాలు జరుగుతాయని, రోడ్డుపై ఉన్న గుంతలలో వర్షపు నీరు నిలిచి గుంతలు కనబడకుండా ఉండటం వలన కూడా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని, కాబట్టి జాగ్రతగా డ్రైవింగ్ చేయాలని, ట్రాఫిక్ రూల్స్ పాటించి సురక్షితంగా గమ్యం చేరుకోవాలని సూచించారు.
డన్ బ్రేక్స్ వేయకండి రోడ్లు వర్షానికి తడిసి ఉన్నందున ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయి…చేవెళ్ల ట్రాఫిక్ సిఐ గురువయ్యగౌడ్.




