దివ్యాంగులకు ప్రాధాన్యతనిస్తాం
– దివ్యాంగులకు సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక కృషి
– రాష్ట్ర మంత్రులు ఈటల, తుమ్మల, మహమూద్ అలీ, నాయిని, తలసాని
– దివ్యాంగులకు ఉచితంగా ట్రైసైకిళ్ల పంపిణీ చేసిన మంత్రులు
హైదరాబాద్, జులై28(జనం సాక్షి) : డబుల్ బెడ్రూం ఇండ్ల కేటాయింపులో దివ్యాంగులకు ప్రాధాన్యతనిస్తామని మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. శనివారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో దివ్యాంగుల సహాయ ఉపకరణముల ఉచిత పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రులు ఈటల రాజేందర్, తుమ్మల నాగేశ్వరరావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, దివ్యాంగుల సంఘం చైర్మన్ వాసుదేవరెడ్డి, కార్యదర్శి జగదీశ్, ఎండీ శైలజ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఈటల మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ దివ్యాంగుల సంక్షేమానికి కృషి చేస్తున్నారన్నారు. 2016లో దివ్యాంగుల కోసం గొప్ప చట్టాన్ని తెచ్చిన రాష్ట్రం తెలంగాణ ప్రభుత్వమని కొనియాడారు. డిగ్రీ ఆపై చదువులు చదువుతున్న వారికి ఈ వాహనాలు అందిస్తున్నామని స్పష్టం చేశారు. రెండో విడతలో డిగ్రీ చదివి ఉన్న నిరుద్యోగ వికలాంగులకు ఈ పథకం ద్వారా అందిస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్లలో
వికలాంగులకు మొదటి ప్రాధాన్యత ఇస్తామని మంత్రి ఈటల హావిూ ఇచ్చారు. దేశంలో ఎక్కడాలేని విధంగా దివ్యాంగులకు ఉచితంగా వాహనాలు అందజేస్తున్న రాష్ట్రం తెలంగాణ అన్నారు. అనేక సంక్షేమ పథకాల్లో 5 శాతం రిజర్వేషన్లు ఇస్తున్నామని, డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణంలో 5 శాతం కోటా అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ సర్కార్‌ది అన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన 2016 చట్టాన్ని తొలిసారిగా రూపొందించిన ప్రభుత్వం ఇదని, ఒక పైలెట్ ప్రాజెక్టుగా తీసుకొని, కోటి మంజూరు చేసి నిరుద్యోగ దివ్యాంగులకు చేయూతనిస్తున్నామని తెలిపారు. మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ తెలంగాణను అగ్రస్థానంలో నిలిపారు. వికలాంగులకు గతంలో పెన్షన్ రూ.500 ఉంటే ఇప్పుడు రూ.1500 ఇస్తున్నామని తెలిపారు. అన్నింటిలో 5 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత సీఎం కేసీఆర్‌దే అన్నారు. రానున్న కాలంలో దివ్వాంగులకు అన్ని విధాల అండగా ఉంటామని తెలిపారు. ¬ంమంత్రి నాయిని నర్సింహరెడ్డి మాట్లాడుతూ.. దివ్యాంగులను అన్ని విధాలా ఆదుకుంటామని, దివ్యాంగులకు ఉచితంగా వాహనాలు ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. డిప్యూటీ సీఎం మహమూద్ అలీ మాట్లాడుతూ.. దివ్యాంగులకు త్రిచక్ర వాహనాలు అందించడం చాలా సంతోషంగా ఉంది. డబుల్ బెడ్రూం ఇండ్లలో గ్రౌండ్ ఫ్లోర్లో దివ్యాంగులకు కేటాయిస్తామని స్పష్టం చేశారు.




