Thursday, 5 November 2026

డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రతి పేదవాడికి మంజూరు చేయాలి

.. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో డబుల్ బెడ్ రూమ్ సందర్శించి నిరసన…..

భువనగిరి టౌన్ (జనం సాక్షి):—
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో డబల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం వద్ద కాంగ్రెస్ పార్టీ కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా డిసిసి అధ్యక్షుడు కుంభ అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ డబల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇంకా సరిగా పూర్తి చేయకుండా నాణ్యత లేకుండా నిర్మాణం చేపట్టారు మరియు కిటికీలు అద్దాలు బాత్రూం డోర్లు ఎక్కడికి అక్కడ విరిగిపోయి ఉన్నవి చాలా ప్లేస్ లలో గోడలు పగుళ్లు పట్టాయి నిర్మాణం పనులు త్వరలో పూర్తి చేసి అన్ని వసతులతో కూడిన మౌలిక సదుపాయాలు కల్పించి లబ్ధిదారులకు అందుబాటులో తేవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ మరియు డబల్ బెడ్ రూమ్ ఇండ్లకు దరఖాస్తుల తేదీని నెల రోజులపాటు పొడిగించాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో ఫ్లోర్ లీడర్ ప్రమోద్ కుమార్ పీసీసీ డెలిగేట్ మెంబర్ తంగడపల్లి రవికుమార్ మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్ కౌన్సిలర్లు కైరం కొండ వెంకటేష్ ,వాడిచర్ల కృష్ణ యాదవ్ ,సల్లావుద్దీన్ మచ్చల జగన్ పాడిగేలు ప్రదీప్ ,ఇరపాక నరసింహ, బిసుకుంటా సత్యనారాయణ,పిట్టల బాల్రాజ్ సోమయ్య కూర వెంకటేష్ కోట స్వామి .నానం కృష్ణ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో పాటు ప్రజలు పాల్గొనడం జరిగింది.