Wednesday, 4 November 2026

డబుల్ రోడ్డు పనులను పరిశీలించినా జడ్పీటీసీ తోటఆగయ్య……..

*ప్రజల ఇబ్బందులను ముందుగా పరిష్కరించాలని సూచన
వీర్నపల్లి సెప్టెంబర్ 20 (జనంసాక్షీ):-
వీర్నపల్లి మండల కేంద్రంలో ఎల్లారెడ్డిపేట నుండి మరిమడ్ల కు వెళ్లే ఆర్అండ్ బి డబుల్ రోడ్డు పనులను ఉమ్మడి మండల జడ్పీటీసీ తోట ఆగయ్య ఆర్ అండ్ బి డిఈ కిషన్ రావు ఈఈ విఘ్నేశ్వర్ రెడ్డి లతో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా తోట ఆగయ్య మాట్లాడుతూ మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ ప్రక్కన మద్దిమల్లకు పోయే మూలమలుపు వద్ద వర్షపు నీరు నిల్వ ఉండడం వలన ప్రజల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు అవుతుందని అచ్చట పైపు వేసి మరమ్మత్తు చేయాలని,ఎస్ ఆర్ పెట్రోల్ బంకు వద్ద కల్వర్ట్ కట్టి బంకు నీరు, వర్షపు నీరు నిల్వ ఉండకుండా చూడాలని, మరియు సబ్ స్టేషన్ పోయే దారిలో వెంకట్రాయిని చెరువులోకి ఎత్తు ప్రాంతం నుండి వచ్చే వర్షపు నీరు ఎక్కువ మోతాదు నిల్వ ఉండడం వలన ఇటు రైతులకు అటూ ఆర్ అండ్ బి రోడ్డుకు ప్రమాదముందని అచ్చట పైపు వేసి రోడ్డు వేయాలని లోకేషన్ చూపిస్తూ డిఈ ఈఈ లకు సలహా సూచలను ఇచ్చారు. అప్పుడు డి ఈ గారు మాట్లాడుతూ ప్రజలకు ఇబ్బంది కలిగి చోట త్వరితగతిన పనులను చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీఆరెస్ మండల అద్యక్షుడు గుగులోత్ శ్రీరాంనాయక్ మార్కేట్ కమిటీ ఉపాద్యక్షుడు నీలం రాజేష్ బాబు డైరెక్టర్ రఫిక్ నాయకులు మల్లేశం జగన్ అర్ఎస్ఎస్ గ్రామ అద్యక్షుడు శెకర్  దేవేందర్ తులసిరాం రవి ప్రభూ భగవంతం శ్రీనివాస్ పృద్వీరాజ్  తదితరులు పాల్గొన్నారు.