Tuesday, 3 November 2026

డబ్బింగ్‌ పార్ట్‌ పూర్తి చేసుకుంటున్న మేజర్‌

టాలీవుడ్‌ టాలెంటెడ్‌ హీరో అడివి శేష్‌ నటించిన లేటెస్ట్‌ మూవీ ’మేజర్‌’. ఈ సినిమాకు దర్శకుడు శశికిరణ్‌ తిక్క. రియల్‌ హీరో సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకొని రిలీజ్‌కు రెడీ అవుతోంది. బాలీవుడ్‌ యంగ్‌ బ్యూటీ సాయీ మంజ్రేకర్‌ హీరోయిన్‌గా, తెలుగమ్మాయి శోభిత ధూళిపాళ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ప్పటికప్పుడు హీరో అడవి శేష్‌ ’మేజర్‌’ మూవీకి సంబంధించిన కీలక అప్డేట్స్‌ను ఇస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మరో అప్‌డేట్‌ను ఇచ్చారు. ప్రస్తుతం ఈ చిత్రాకి తన లాస్ట్‌ అండ్‌ ఫైనల్‌ వర్క్‌ అయిన డబ్బింగ్‌ పార్ట్‌ను స్టార్ట్‌ చేసేసినట్టుగా తెలిపారు. ఈ మేరకు మైక్‌ ముందు ఉన్న ఒక ఫోటోను కూడా సోషల్‌ విూడియాలో షేర్‌ చేశారు. కాగా, ఈ చిత్రానికి మహేష్‌ బాబు సహా సోనీ పిక్చర్స్‌ వారు నిర్మాణం వహిస్తున్నారు. మే 27న భారీ స్థాయిలో ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.