నేచురల్ స్టార్ నాని గత కొంతకాలంగా ఎక్కువగా ప్రయోగాత్మక సినిమాలతో వచ్చి అలరిస్తున్నాడు. ఇటీవలే శ్యామ్ సింగ రాయ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాని.. హిట్ అందుకున్నాడు. ఈ సినిమాలో నాని రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించి ఆకట్టుకున్నాడు. ఇప్పుడు రాబోయో చిత్రాల్లోనూ నాని డిఫరెంట్ మేకోవర్‌తో కనిపించబోతున్నాడు. ’అంటే.. సుందరానికి’ అనే సినిమాలో ఓ బ్రహ్మణ యువకుడి పాత్రలో నాని నటిస్తున్నాడు. బ్రహ్మణ యువకుడి కష్టాలను నాని పాత్ర ద్వారా చాలా ఫన్నీగా
చూపించబోతున్నట్లుగా తాజాగా విడుదల అయిన గ్లిమ్స్ చూస్తేనే అర్థం అవుతుంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉండగా..’దసరా’ అంటూ మరో సినిమాను సెట్స్ విూదకు తీసుకువచ్చాడు. ఇందులో నాని లుక్ ఇప్పటి వరకు చేసిన సినిమాలన్నిటికంటే కంప్లీట్ డిఫరెంట్‌గా ఉంది. ఇప్పటికే ’దసరా’ సినిమాలోని నాని ఫస్ట్ లుక్ రిలీజై ఆకట్టుకుంది. కీర్తి సురేశ్ ఈ సినిమాలో నాని సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. ఇలా ఒక్కో సినిమాకు ఒక్కో డిఫరెంట్ మేకోవర్‌తో సర్‌ప్రైజ్ చేస్తున్న నాని కొత్త తరహా కథల్లో నటిస్తూ పెద్ద ప్రయోగాలనే చేస్తున్నాడు. మరి నానికి ఈ ప్రయోగాలు ఎంతవరకు సక్సెస్‌ను ఇస్తాయో చూడాలి.




