డబ్బుల్లేక ఆత్మహత్య చేసుకున్న ఓ వ్యక్తి
నంగునూరు, సెప్టెంబర్24(జనంసాక్షి):
మద్యానికి బానిసై తాగడానికి డబ్బులు లేక చివరికి ఆత్మహత్య చేసుకున్న సంఘటన నంగునూరు మండలకేంద్రంలో శనివారం రోజున చోటు చేసుకుంది.రాజగోపాల్ పేట ఎస్సై మహిపాల్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం… నంగునూరు గ్రామంలోని ముదిరాజ్ కులానికి చెందిన గుడబోయిన యాదగిరి(40) తాగుడుకు బానిసై డబ్బుల కోసం ఇంట్లో నిత్యం గొడవలు చేస్తూండేవాడు. ఎవ్వరూ డబ్బులు ఇవ్వకపోవడంతో జీవితం మీద విరక్తి చెంది తేదీ 22.09.2022 నాడు మధ్యాహ్నం 3 గంటల సమయంలో అదే గ్రామానికి చెందిన బింగారి కిషన్ పొలం వద్ద పంటలకు వాడే క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యకు పాల్పడడంతో అతన్ని వెంటనే సిద్ధిపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఇంకా మెరుగైన చికిత్స కోసం అక్కడినుంచి హైదరాబాద్ గాంధీకి తరలించగా శనివారం నాడు ఉదయం 8 గంటల ప్రాంతంలో మరణించడం జరిగింది. మృతుని కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై మహిపాల్ రెడ్డి పత్రిక ప్రకటనలో తెలిపారు.
ReplyForward
|