Tuesday, 3 November 2026

డల్లాస్‌లో ఘనంగా తెలుగు వేడుకలు

ఆటపాటలతో అదుర్స్‌

హైదరాబాద్‌,జూన్‌4(జ‌నం సాక్షి): డల్లాలస్‌లో తెలుగు వేడుకలు అంబరాన్నింటాయి. సినీతారలు,గాయకలు తోడవ్వడంతో వేడుకలుకు మరింత ఊపు వచ్చింది. ఉర్రూతలూంగిచే డ్యాన్స్‌.. ఉల్లాసంగా సాగే పాటలు.. అదిరిపోయే స్టెప్పులు.. సెలెబ్రెటీస్‌ తళుకులు మొత్తంగా మూడు రోజులుగా అమెరికన్‌ తెలుగు కన్వెన్షన్‌ వేడుకలు అంబరాన్నంటాయి. డల్లాస్‌ లోని ఇర్వింగ్‌ వేదికగా జరిగిన ఈ వేడుకల్లో అమెరికాలోని తెలుగువారి ఐక్యతను ప్రతిబింబించాయి.. అమెరికన్‌ తెలుగు కన్వెన్షన్‌ వేడుకల్లో భాగంగా చివరి రోజు కార్యక్రమంలో సౌత్‌ బ్యూటీ త్రిష తళుక్కుమన్నారు.. త్రిషతో పాటు యాంకర్లు సుమ, సుడిగాలి సుధీర్‌ సందడి చేశారు. అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ ఆటా, తెలంగాణ అమెరికా తెలుగు అసోసియేషన్‌ టాటా, సంయుక్తంగా నిర్వహించిన ఈ వేడుకల్లో డ్యాన్స్‌ స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచింది. ముఖ్యంగా శాంతి నుతి కొరియో గ్రఫీలో.. మాస్‌ బీట్స్‌ టీమ్‌ పర్ఫార్మెన్స్‌ అందర్నీ మెస్మరైజ్‌ చేసింది. తర్వాత ఓల్డ్‌ సాంగ్స్‌, లేటెస్ట్‌ సాంగ్స్‌ మిక్స్‌ చేసి? నాడు-నేడు టీమ్‌ ఇచ్చిన క్రియేటివ్‌ పర్ఫార్మెన్స్‌ అందరి మనసుల్ని దోచుకుంది. హుషారుగా సాగిన ఈ వేడుకల్లో డ్యాన్సులే కాదు? పాటలతో కూడా స్టార్‌ సింగర్లు అందర్నీ అలరించారు. టాలీవుడ్‌ సింగర్లు రాహుల్‌ సిప్లిగంజ్‌, మాళవిక అద్భుతమైన పాటలతో ఉర్రూతలూగించారు. ఇక మేఘా గణపురం టీమ్‌ డ్యాన్స్‌ ఈ వేడుకల్లో ప్రత్యేకంగా నిలిచింది. తెలుగు, హిందీ పాటల బీట్‌కు సరికొత్త స్టెప్పులతో యువతులు చేసిన డ్యాన్స్‌ వారెవ్వా అనిపించింది. అనంతరం తెలంగాణ కవుల గొప్పతనాన్ని జయ¬ అనే పాటతో కళాకరులు అద్భుత నృత్యంతో ఆవిష్కరించారు. ఇక అట్లాంటా డ్యాన్స్‌ అకాడవిూ తరపున మనస్విని, సంజన చేసిన డ్యాన్స్‌ పర్ఫార్మెన్స్‌ వీక్షకుల్ని మైమరపించింది. తర్వాత రాగలీల అకాడవిూ బృందం చేసిన ప్రదర్శన అయితే మొత్తం వేడుకలకే హైలైట్‌గా నిలిచింది. సంప్రదాయ నృత్యాన్ని, వెస్టన్ర్‌ స్టెప్పులతో మేళవించిన ఈ క్రియేటివ్‌ పర్ఫార్మెన్స్‌ వీక్షకుల్ని మరో లోకంలోకి తీసుకెళ్లింది.