అల్వాల్ (జనంసాక్షి) సెప్టెంబర్ 20
అల్వాల్ సర్కిల్ ఓల్డ్ అల్వాల్ విబిఆర్ ఫంక్షన్ హాల్లో మంగళవారం అల్వాల్ సర్కిల్ కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త సామాజికవేత్త తాటికొండ పట్టాభికి ఏషియా వేదిక్ కల్చర్ రిసర్చ్ యూనివర్సిటీ వారి ద్వారా డాక్టరేట్ అవార్డు పొందిన సందర్భంగా ఆత్మీయ సన్మాన సభ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథి హాజరైన మల్కాజ్గిరి నియోజకవర్గ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పట్టాభిని శాలువాతో ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు అనిల్ కిషోర్ గౌడ్, బలవంత రెడ్డి, నాగేశ్వరరావు, పరమేష్, రాజసింహారెడ్డి, భాస్కర్, బబిత, కవిత, స్థానిక నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
Attachments area




