Monday, 2 November 2026

డిజిటల్ బ్యాంకింగ్ లో అగ్రగామిగా ఉండాలి

నగదురహిత లావాదేవీలను నిర్వహించడంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అగ్రభాగాన ఉండాలన్న కృతనిశ్చయంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఈ లక్ష్యం దిశగా ముందుకెళ్లటంపై చర్చించటం కోసం రాష్ట్రమంత్రివర్గం సోమవారం మధ్యాహ్నం 2.20 గంటలకు సచివాలయంలో సమావేశం కానుంది. సమావేశం అనంతరం.. పెద్దనోట్ల రద్దు తరువాత జరిగిన పరిణామాలు, తలెత్తుతున్న పరిస్థిkcr_2877520fతులు, ప్రజల ఇబ్బందులను పరిష్కరించటానికి తీసుకునే చర్యలు తదితర అంశాలపై కేబినెట్ సమావేశ నిర్ణయాలను సీఎం కేసీఆర్ స్వయంగా మీడియాకు వివరించనున్నట్లు సమాచారం. పెద్దనోట్ల రద్దు నిర్ణయం నేపథ్యంలో రాష్ట్రంలో ఏర్పడిన పరిస్థితులు, సోమవారం జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చించాల్సిన అంశాలకు సంబంధించి.. అందుబాటులో ఉన్న మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ ఆదివారం ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహించారు.నోట్లరద్దు తదనంతర పరిణామాలపై ప్రభుత్వం ఏమి చేయాలనే అంశంపై కార్యాచరణ రూపొందించి వెంటనే నివేదిక ఇవ్వాలని ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావును సీఎం ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *