Friday, 6 November 2026

డిజిటల్ బ్యాంకింగ్ సేవలను వినియోగదారులు ఉపయోగించుకోవాలి.

దశమంత రెడ్డి. జనగామ (జనం సాక్షి) అక్టోబర్15: భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో దశమంత రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా దశమంత రెడ్డి మాట్లాడుతూ రేపు దేశంలో 75 డిజిటల్ బ్యాంకింగ్ సేవలను ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీలో ప్రారంభిస్తారని తెలంగాణలో జనగామ జిల్లా సిరిసిల్ల జిల్లా ఖమ్మం జిల్లాకు స్థానం లభించిందని ఈ సందర్భంగా రేపు జనగామ పట్టణంలోని మున్సిపాలిటీ ఆవరణలో ఉన్న ఎస్బిఐ బ్రాంచ్ కు డిజిటల్ సేవలు వీక్షించడానికి ఉదయం 10 గంటలకు జి కిషన్ రెడ్డి కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మరియు ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రివర్యులు విచ్చేస్తున్నారని కావున కార్యకర్తలు నాయకులుహాజరు కావాలని తెలిపారు .ఈ కార్యక్రమంలో బిజెపి జనగామ జిల్లా ప్రధాన కార్యదర్శి సౌడ రమేష్ శివరాజ్ యాదవ్ సోషల్ మీడియా నాయకులు దండు శ్రీనివాస్ పట్టణ ప్రధాన కార్యదర్శి సంపత్ దళిత మోర్చా పట్టణ అధ్యక్షులు తోకల హరీష్ క్రాంతి తదితరులు పాల్గొన్నారు.