డిపి విద్యుత్ మోటార్ రిపేర్ చేయించిన సర్పంచ్

టేకులపల్లి, సెప్టెంబర్ 8( జనం సాక్షి ): మండల పరిధిలోని ముత్యాలపాడు క్రాస్ రోడ్ గ్రామపంచాయతీ నందు మా లోతు వారి వీధిలో ఉన్న బోర్ కి విద్యుత్తు మోటారు ఏర్పాటుచేసి డైరెక్ట్ పైపులైన్ ద్వారా గ్రామపంచాయతీ నిధులతో మంచినీరు అందిస్తుండటంతో కొద్దిరోజుల క్రితం మోటార్ రిపేర్ ఏర్పడింది. స్థానికులు తెలపడంతో వెంటనే గ్రామపంచాయతీ సర్పంచ్ మాలోతు సురేందర్ నాయక్ పంచాయతీ కార్యదర్శి శ్వేత శుక్రవారం మోటార్లు పీకి మెకానిక్ ద్వారా రిపేరు చేయించి యధావిధిగా మంచినీటి సరఫరాను అందించారు. గ్రామపంచాయతీ పరిధిలో ఎలాంటి సమస్యలు ఉన్న తనకు తెలియజేయాలని పరిష్కరించడానికి తన వంతు కృషి చేస్తానని సర్పంచ్ సురేందర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.