నిమర్జన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే అజ్మీరా రేఖ శ్యామ్ నాయక్
అన్నీ ఏర్పాట్లు పూర్తి….
ఏదైనా ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తీసుకొని రావాలని సూచించిన ఎమ్మెల్యే
ఖానాపూర్ పట్టణంలోని గోదావరి వద్ద నిమర్జన ఏర్పాట్లను ఎమ్మెల్యే అజ్మీరా రేఖ శ్యామ్ నాయక్ పరిశీలించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ శాంతియుతంగా నిర్వహించుకోవాలని సూచించారు.అన్ని ఏర్పాట్లను ఖానాపూర్ మున్సిపల్ ఏర్పాటు చేసిందని తెలిపారు ఎటువంటి ఇబ్బందులూ లేకుండా చూడాలని మున్సిపల్ కమిషనర్ ఛైర్మెన్ కౌన్సిలర్స్ లను ఆదేశించారు. యువత మద్యానికి దూరంగా ఉండాలి అన్నారు.హిందూ పండగలను ఐకమత్యంతో జరుపుకోవాలని దానికి యువత ముందుండి నడిపించాలి అని అన్నారు.