రాహుల్ పాదయాత్రకు సంఘీభావం తెలిపిన – మాధవరెడ్డి

కూసుమంచి సెప్టెంబర్ 8 (జనం సాక్షి): రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో పాదయాత్రకు రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు రామసహాయం మాధవరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు సంఘీభావం తెలిపారు. గురువారం రోజున పాలేరు వేణుగోపాలస్వామి ఆలయం నుండి కూసుమంచి మండల కేంద్రం వరకు వందల మంది కార్యకర్తలతో పాదయాత్ర చేసి సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక పాలనకు నిరసనగా రాహుల్ గాంధీ చేపట్టిన జోడో పాదయాత్రను కాంగ్రెస్ శ్రేణులు అందరూ మద్దతు తెలపాలంటే రాబోయే పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి మరల కేంద్రంలో, రాష్ట్రంలో ప్రజల సుఖశాంతులతో బ్రతికే విధంగా చేయాలని ఆమె కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు కొరివి వెంకటరత్నం, మండల కాంగ్రెస్ అధ్యక్షులు మట్టి గురవయ్య, కనకం మైసయ్య, కలీం పాషా, తిరుమలేశు మరియు ఇతర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.