డిమాండ్లు పరిష్కరించే వరకు ధర్నా విరమించేది లేదు

* వీఆర్ఏ జిల్లా అధ్యక్షుడు ఐలేష్,మండల అధ్యక్షుడు బిక్షపతి,
ఖానాపురం ఆగష్టు 24జనం సాక్షి
 తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ అసెంబ్లీ సాక్షిగా వీఆర్ఏలకు ఇచ్చిన ఈ విధంగా హామీలను నెరవేర్చే వరకు ధర్మాలు విరమించేది లేదని వీఆర్ఏల జిల్లా అధ్యక్షుడు ఐలేష్,మండల అధ్యక్షుడు బిక్షపతి,అన్నారు. ఖానాపురం మండల కేంద్రంలో తాసిల్దార్ కార్యాలయం వద్ద వీఆర్ఏల నిరవధిక సమ్మె 31 వ రోజుకు చేరడంతో  ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వీఆర్ఏ జిల్లా అధ్యక్షుడు ఐలేష్, హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వీఆర్ఏలు గత 31 రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మె చేస్తున్న కూడా రాష్ట్ర ప్రభుత్వానికి చీమకుట్టినట్టు లేదని వాపోయారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వీఆర్ఏల న్యా