Tuesday, 3 November 2026

డీఎల్‌ పై ధ్వజమెత్తిన వీరశివారెడ్డి

హైదరాబాద్‌,(జనంసాక్షి): మాజీమంత్రి డీఎల్‌ రవీంద్రరెడ్డిపై కమలాపురం కాంగ్రెస్‌ ఎమ్మెల్యే వీరాశివారెడ్డి మరోసారి ధ్వజమెత్తారు. కిరణ్‌కుమార్‌ రెడ్డి నాయకత్వాన్ని అంగీకరించకపోతే డీఎల్‌ కాంగ్రెస్‌ నుంచి వెళ్లిపోవచ్చని ఆయన శనివారమిక్కడ అన్నారు. చలో అసెంబ్లీ విషయంలో కిరణ్‌ సర్కార్‌కు అప్రతిష్ట రావాలని డీఎల్‌ కోరుకున్నారని వీరశివారెడ్డి ఆరోపించారు.
అయితే అది జరగకపోగా హైకమాండ్‌ పెద్దలు మెచ్చుకోవటంతో డీఎల్‌కు కడుపు మండిందని ఆయన వ్యాఖ్యానించారు. డీఎల్‌ ఓఎస్‌డీపై ఏసీబీ విచారణ జరుగుతుందని.. దానిలో డీఎల్‌ అవినీతి బయటపడుతుందని అన్నారు. ఆ కేసులో డీఎల్‌ రవీంద్రారెడ్డి కూడా జైలుకు వెళతారని వీరశివారెడ్డి వ్యాఖ్యలు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *