Tuesday, 3 November 2026

సీమాంధ్రుల నేతృత్వంలో ప్రభుత్వం పనిచేస్తోంది

కోమటిరెడ్డి

హైదరాబాద్‌ : తెలంగాణ ఉద్యమాన్ని అణచివేసేందుకు సీమాంధ్రుల నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అరోపించారు. హైదరాబాద్‌లో యుద్ధ వాతావరణం సృష్టించి చలో అసెంబ్లీని అడ్డుకునే ప్రయత్నం చేసిందని విమర్శించారు. శనివారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ…. పోలీసుల అత్యుత్సాహం కారణంగా సామాన్యులు తీవ్ర అవస్థలు పడాల్సి వచ్చిందన్నారు. అధికారంతో ఉద్యమాన్ని అణచేందుకు ప్రయత్నిస్తే ఉద్ధృతమవుతుందన్న సంగతి సీమాంధ్ర పాలకులు తెలుసుకోవాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *