హైదరాబాద్: పోలీసుల వైఫల్యం వల్లే ముషీరాబాద్‌లో దసరా సందర్భంగా అమ్మవారి గుడిపై ఓ వర్గానికి చెందిన అల్లరి మూక దాడిచేసిందని భాజపా బృందం శాంతిభద్రతల డీజీ హుడాను కలిసింది. అమ్మవారి దేవాలయంపై రాళ్లతో దాడి చేసి చెప్పులు విసిరినా స్థానిక సీఐ ఏకపక్షంగా వ్యవహరించడమే కాకుండా, అడ్డుకున్న బస్తీవాసులపై కేసులు పెట్టారని భాజపా నేతలు బండారు దత్తాత్రేయ, లక్ష్మణ్ ఆరోపించారు. మజ్లిన్ పార్టీ నేతల చేతిలో కీలు బొమ్మలుగా వ్యవహరిస్తున్న పోలీసు అధికారులపై కమిషనర్ జోక్యం చేసుకుని విధులనుంచి తప్పించాలని కోరారు. దాడికి పాల్పడ్డ అల్లరిమూకపై చర్యలు తీసుకుని, అరెస్టు చేసిన బస్తీ వాసులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ వ్యక్తం చేశారు.




