డెంగ్యూ జ్వరం తో ఒకరు మృతి..

 

మహాదేవపూర్. సెప్టెంబర్17 (జనంసాక్షి)

మహాదేవపూర్ మండలంలోని పెద్దంపేట లో శుక్రవారం రాత్రి విషజ్వరం తో ఒకరు మృతి చెందాడు. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం మృతుడు దుర్గం పోచయ్య (59) కు పెద్దంపేట శివారు లో రెండున్నర ఎకరాల చేను ఉన్నది. పది రోజుల క్రితం మిర్చి దిబ్బలకు నీళ్ళు పట్టడానికి వెళ్లి అక్కడే కళ్ళు తిరిగి పడిపోగా అది గమనించిన కుటుంబసభ్యులు వరంగల్ హాస్పిటల్ కు తరలించి చికిత్స అందించగా పరీక్షల అనంతరం డెంగ్యూ గా గుర్తించారు, వైద్యం చేయించుకుని ఇంటికి తీసుక వచ్చారు. కాగా మళ్ళీ జ్వరం తో నాలుగురోజులుగా తీవ్ర అనారోగ్యానికి గురై శుక్రవారం రాత్రి మరణించాడని తెలిపారు. మృతునికి భార్య మధునక్క, నలుగురు సంతానం ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు