Wednesday, 4 November 2026

డెంగ్యూ మలేరియా పట్ల అప్రమత్తంగా ఉండాలి

  అల్వాల్ (జనంసాక్షి)జూలై 19

డెంగ్యూ మరియు మలేరియా పట్ల అప్రమత్తంగా ఉండాలని వెంటమాలజిస్ట్ ఏఈ అనిల్ తెలియజేశారు. అల్వాల్ సర్కిల్ మచ్చ బొల్లారం డివిజన్ తుర్కపల్లి సాయిధామ్ కాలనీలో డెంగ్యూ మలేరియా పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు అవగాహన కల్పించారు. పరిసర ప్రాంతాలలో నీరు నిలువకుండా  చూసుకోవాలని నిల్వ ఉండే పాత్రలను పరుచుకోవాలి వాటిపై మూతలను ఏర్పాటు చేసుకోవాలని దోమలు నియంత్రణకు మందులు వాడాలని దోమతెరలు ఏర్పాటు చేసుకోవాలని తగు సూచనలు చేశారు. డెంగ్యూ వ్యాధి వచ్చినప్పుడు తీవ్రమైన తలనొప్పి వాంతులు విరోచనాలు కరుగుతాయని డాక్టర్ల సలహాలతో మందులు వాడాలని సూచించారు.