నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి
– టీపీసీసీ ఉపాధ్యక్షులు మాజీ ఎంపీ సురేష్ షేట్కార్,
నారాయణఖేడ్ జులై 19 (జనంసాక్షి )
నారాయణఖేడ్ నియోజకవర్గ
శంకరం పెట్ మండల బుజరాన్ పల్లి గ్రామానికి చెందిన నిరుడి భగయ్య కు రూ.17500 , నీరుడి జైపాల్ కు రూ.12500, రూపాయలను ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సహకారంతో సీఎం సహాయనిది చేకులు నారాయణఖేడ్ మంగళవారం రోజు మాజీ ఎంపీ సురేష్ షేట్కార్ స్వగృహంలో చెక్కులు
అందించారు.ఈ కార్యక్రమంలో శంకరం పెట్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాయిని మధు,మాజీ మండల అధ్యక్షులు జనార్దన్, శంకరం పెట్ పట్టణ అధ్యక్షులు గంగ రెడ్డి,సర్పంచులు బుదేమా విఠల్ బుజారాన్ పల్లి,ముశపెట్ సర్పంచ్ అంజి రెడ్డి,కుమార్, జంగానత్ రావు,జైపాల్ గౌడ్,మైపల్ గౌడ్,మలేశం,ఇతరులు పాల్గొన్నారు.
నేడు కంగ్టిలో రచ్చబండ
పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ రైతు రచ్చబండ కార్యక్రమం కంగ్టి మండల కేంద్రంలో ఉదయం 11 గంటలకు రచ్చబండ నిర్వహించడం జరుగుతుందని, పీసీసీ ఉపాధ్యక్షులు మాజీ ఎంపీ సురేష్ షేట్కార్ పిసిసి సభ్యులు పట్లోళ్ల సంజీవరెడ్డి లు హాజరుకానున్నారని, అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు.