డేంజర్ జోన్ గా.. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ

పనుల్లో జాప్యం…,
కొండమల్లేపల్లి సెప్టెంబర్ 30 (జనం సాక్షి): పట్టించుకోని అధికారులు..,
ప్రజాప్రతినిధులు..
ఇబ్బందులకు గురి అవుతున్న వాహనదారులు.. స్థానిక కాలనీ వాసులు.
కొండమల్లేపల్లి..మండల కేంద్రంలోని నల్గొండ రోడ్ లోని పాతవూరు లో గల 1వ వార్డ్ లో డ్రైనేజీ పనులు ప్రారంభించి 30 రోజులవుతుంది. అయిన ఎలాంటి పురోగతి లేదు. మొత్తం గుంతలు ఏర్పడడం వలన కాలనీవాసులకు రాకపోకలకు ఇబ్బంది కలగుతుంది.అలాగే చిన్నపిల్లలు ఆడుకుంటూ వెళ్లి గుంతలో పడుతున్నార్రు. ద్విచక్ర వాహనదారులు మరియు బురద నీరు వల్ల స్క్రిడ్ అయ్యి పడిపోతున్నారు.మరియు వర్షాల వల్ల డ్రైనేజీ కోసం తీసిన గుంతల నిండా మురుగు నీరు చేరి దోమలు, పందులు స్వైర విహారం చేస్తున్నాయి.వీటి వల్ల విష జ్వరాలు ప్రబలే అవకాశం ఉంది. 1వ వార్డ్ కాలనీ వాసులు వెంటనే పనులు పూర్తి చేయాలనీ గ్రామపంచాయతీ అధికారులను స్థానిక ప్రజా ప్రతినిధులను వేడుకుంటున్నారు.