బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం : బిఆర్ఎస్ దుబ్బాక నియోజకవర్గ సీనియర్ నాయకులు, ప్రజాహిత ఫౌండేషన్ వ్యవస్థాపకులు మామిడి మోహన్ రెడ్డి.

దౌల్తాబాద్ జూలై 31, జనం సాక్షి.

దౌల్తాబాద్ మండల పరిధిలో గోవిందాపూర్ గ్రామానికి చెందిన శంకర్ గౌడ్ అనే యువకుడు ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందాడు.దౌల్తాబాద్ మండల కేంద్రంలో పద్మిని వెంకటయ్య గుండెపోటుతో మరణించాడు. వారి కుటుంబాలను పరమర్శించి, ప్రగాఢ సానుభూతి వ్యక్తపరిచి, ఆర్థిక సహాయం అందజేశారు. అనంతరం ఎ ఏం సి డైరెక్టర్ పబ్బ అశోక్ గుప్తను పరామర్శించారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రతి బిఆర్ఎస్ కార్యకర్తకు ఏ ఆపద వచ్చిన ఆదుకుంటానని వారికి అండగా ఉంటూ ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహయ సహకారాలు అందేలా చూస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమం లో రాయపోల్ జడ్పీటీసీ యాదగిరి, దౌల్తాబాద్ పట్టణ బిఆర్ఎస్ అధ్యక్షులు నరసింహారెడ్డి, రాయపోల్ మాజీ సర్పంచ్ శ్రీనివాస్ చారి, ఆత్మ కమిటీ డైరెక్టర్ సుదర్శన్, దౌల్తాబాద్ బిఆర్ఎస్ యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ చింటూ, కోనపూర్ ఉప సర్పంచ్ రాజిరెడ్డి,వార్డ్ సభ్యులు మాశెట్టి నరేష్ గుప్తా, బిఆర్ఎస్ నాయకులు ఎల్లం,సందీప్, ప్రవీణ్,తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు