హైదరాబాద్ సిటీ: డ్రంకెన్ డ్రైవ్ చేసిన 16 మందికి జైలు శిక్ష, రెండువేలు జరిమానా విధిస్తూ ఎర్రమంజిల్ 3వ, 4వ మెజిసే్ట్రట్ కోర్టులు తీర్పు చెప్పాయి. నిందితుల్లో ఇద్దరికి 7, ఇద్దరికి 5, ముగ్గురికి 3, నలుగురికి 2 రోజులు, మరో ఐదుగురికి పనివేళలు ముగిసే వరకు కోర్టులోనే ఉండాలనే ఆదేశించాయి. ఈనెల 19, 20, 21, 26 తేదీల్లో పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి 423 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు. నిందితుల్లో ద్విచక్ర వాహనదారులు 328, ఆటో డ్రైవర్లు 17, కారు డ్రైవర్లు 75, ఇతరులు ముగ్గురు ఉన్నారు. శుక్రవారం వరకు డ్రంకెన్ డ్రైవ్ చేసినవారిపై 10,187 కేసులు నమోదు చేయగా వీరిలో 1335 మందికి శిక్ష పడినట్టు ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ జితేందర్ తెలిపారు.




