Wednesday, 4 November 2026

డ్రగ్స్‌ నిర్మూలనకు కఠినంగా వ్యవహరించాలి

మహమ్మారి మత్తులో పడకుండా జాగ్రత్త పడాలి
డ్రగ్స్‌ నిర్మూలనపై అవగాహన సదస్సులో మంత్రి తలసాని
హైదరాబాద్‌,ఫిబ్రవరి24(జనం సాక్షి): తెలంగాణలో డ్రగ్స్‌ నిర్మూలనకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు పట్టుదలగా ఉన్నారని, ఈ విషయంలో మరిన్నికఠిన నిర్ణయాలు తీసుకోనున్నారని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ పేర్కొన్నారు. పోలీసులు ఈ విషయంలో మరింత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం వుందన్నారు. గురువారం నార్త్‌ జోన్‌ పోలీసుల ఆధ్వర్యంలో డ్రగ్స్‌ నిర్మూలన పై అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి తలసాని ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో డ్రగ్స్‌ నివారణ పై తీసుకోవాల్సిన చర్యలపై ఇప్పటికే రెండుసార్లు ఉన్నతాధికారులతో సమావేశాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ప్రస్తుతం డ్రగ్స్‌ మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేస్తున్నదని మంత్రి పేర్కొన్నారు. చాలా మంది తెలియకుండానే డ్రగ్స్‌కు బానిసలుగా మారుతు న్నారని, ఒక్కసారి డ్రగ్స్కు బానిసలు అయితే చావే శరణ్యమని అన్నారు. డ్రగ్స్‌ ఉపయోగించడం వలన కుటుంబాలు రోడ్డున పడుతాయని, తప్పు చేసి జైలుకు వెళ్లడం ఎందుకు అసలు తప్పే చేయకుండా ఉంటే బావుంటుందని సూచించారు. చాలా నేరాలలో నేరస్తులను క్షణాల్లో పట్టుకునే సత్తా తెలంగాణ
పోలీసులకే ఉందన్నారు. ప్రస్తుతం కార్పోరేట్‌ ఆఫీలకు ధీటుగా పోలీస్‌ స్టేషన్‌ కార్యాలయాలు ఉన్నాయని అన్నారు. సమాజంలో ఉన్న డ్రగ్స్‌ మాఫియాను నిర్ములించడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. డ్రగ్స్‌ వల్ల కలిగే అనర్దాలపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలన్నారు.విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌ ఇమేజ్‌ ను దెబ్బతీసే డ్రగ్స్‌ ను ప్రతి ఒక్కరం నిర్ములిద్దామని ఈసందర్భంగా మంత్రి పిలుపునిచ్చారు. డ్రగ్స్‌లో పట్టుబడితే పోలీసులు ఎవ్వరిని వదిలి పెట్టరన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ప్రపంచాన్ని డ్రగ్స్‌ ప్రస్తుతం కుదిపేస్తున్నది. చాలా మంది తెలియ కుండానే డ్రగ్స్‌కు బానిసలుగా మారుతున్నారని ఆయన తెలిపారు. ఒక్కసారి డ్రగ్స్‌ కు బానిసలు అయితే చావే శరణ్యం అన్నారు. విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌ ఇమేజ్‌ను దెబ్బతీసే డ్రగ్స్‌ను అందరం కలిసి అడ్డుకుందామన్నారు. డ్రగ్స్‌ తీసుకుంటూ పట్టుబడితే పోలీసులు ఎంతటి వారినైనా వదిలి పెట్టరని హెచ్చరించారు.