బోడుప్పల్:బోడుప్పల్ మున్సిపల్ పరిధి చెంగిచెర్ల లోని ఆర్టీసీ కాలనీ మెయిన్ రోడ్డు వద్ద గతంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వర్కు పూర్తి చేసారు. కానీ దీనికి సరైన అవుట్ లెట్ లేక, పైన ఉన్న కాలనీల నుండి వచ్చే మురుగు నీరు మొత్తము మెయిన్ రోడ్డు పైన ఆగిపోవడం జరుగుతుంది .ఈ మురుగునీరు వలన దుర్వాసన రోజురోజుకు పెరుగుతూ వస్తుంది. ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లో రోజు రోజు నీరు ప్రవాహము లేనందున నీరు ఇక్కడే ఆగిపోతుంది ,తద్వారా పందులు, దోమల బెడద ఎక్కువ అయింది.ఈ సమస్య గురించి ఆర్టీసీ కాలనీ, హరితవనం కాలనీ, ప్రశాంత్ నగర్ కాలనీ ,దుర్గా రెసిడెన్సి ,నారాయణ కాలనీ వారు అందరూ కలిసి ఎన్నోసార్లు మున్సిపల్ అధికారులకు ఈ సమస్యను గురించి విన్నవించుకోవడం జరిగింది కానీ ఈ సమస్య పైన ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వలన డ్రైనేజీ నుండి వస్తున్నటువంటి దుర్వాసనను కాలనీవాసుల ను మరియు రోడ్డుపైన ప్రయాణించే ప్రయాణికులను ఇబ్బందికి గురి చేస్తుంది అని కాలనీ వాసులు చెబుతున్నారు. ఇప్పటికైనా ఈ సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని కోరుతున్నారు.