న్యూఢిల్లీ : దేశ రాజధాని నగరంలో తెలంగాణ శకటం మెరిసింది. రిపబ్లిక్ డే వేడుకల్లో తొలిసారిగా తెలంగాణ శకటాన్ని ప్రదర్శించారు. వివిధ రాష్ట్రాల శకటాలు వరుసగా వస్తుండగా, మధ్యప్రదేశ్, అసోం రాష్ట్రాల శకటాల తర్వాత తెలంగాణ శకటాన్ని తీసుకొచ్చారు.
ముందు పోతురాజు, వెనక బోనాలతో పాటు బోనాల పండుగ సందర్భంగా కనిపించే విశేషాలతో ఈ శకటం అందరికీ ఆసక్తి కలిగించింది. శకటం మీద మహిళల సంప్రదాయ నృత్యాలు కూడా అలరించాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా శకటాన్ని ప్రదర్శించే అవకాశం రావడంతో.. దీన్ని అన్ని రంగులతో తీర్చిదిద్దారు.




