Wednesday, 4 November 2026

తండాలతో పెరిగిన పంచాయితీలు

హైదరాబాద్‌,మే28(జ‌నం సాక్షి): తండాలను పంచాయితీలుగా మార్చడంతో గ్రామపంచాయితీల సంఖ్య పెరిగింది. దీంతో వీటన్నిటికి వచ్చే జూలైలో ఎన్నిక‌లు నిర్వహించబోతున్నారు.  2013లో 8,684 గ్రామపంచాయతీలు, 88,682 వార్డులకు ఎన్నికలు జరిగాయి. తెలంగాణ ప్రభుత్వం కొత్త పంచాయతీరాజ్‌ చట్టం అమల్లోకి తేవడంతో గ్రామాల సంఖ్య పెరిగింది. మొత్తం 12,751 గ్రామపంచాయతీలు ఏర్పడ్డాయి. వీటిలో వందశాతం ఎస్టీలున్న గ్రామాలు 1,326, ఏజెన్సీ గ్రామాలు 1,311కాగా, మిగిలిన మైదాన పంచాయతీలు 10,114 ఉన్నాయి. మొత్తం వార్డులు 1,13,380. ఏజెన్సీ, మైదాన ప్రాంత గిరిజన పంచాయతీల్లో సర్పంచులకు వంద శాతం, వార్డు సభ్యులకు 50 శాతం గిరిజనులకు కేటాయిస్తూ చట్టంలో నిబంధనలు పొందుపర్చారు.