Tuesday, 3 November 2026

తక్కువ ధరకే బంగారమంటూ మోసం

చాదర్‌ఘాట్‌: తక్కువ ధరకే బంగారం అమ్ముతున్నట్టు నమ్మించి మోసం చేస్తున్న వ్యక్తిని చాదర్‌ఘాట్‌ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. అతడినుంచి 4 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల మావేశంలో సుల్తాన్‌బజార్‌ డివిజన్‌ ఏసీపీ ఆర్‌. గిరిధర్‌ వివరాలను వెల్లడించారు. కర్ణాటక రాష్ట్రం ధావణగిరి జిల్లా హర్పనాలి మండలంపవన్‌పూర్‌ గ్రామ నివాసి కె.కుమార్‌ అలియాస్‌ రాజు, అతడి తండ్రి మహదేవప్ప, అదే ప్రాంతానికి చెందిన పి.నాగరాజు మలక్‌పేట మహబూబ్‌ మాన్షన్‌ మార్కెట్‌లోని వాణీ ట్రేడర్స్‌ వ్యాపారి వంజరి వినోద్‌కుమార్‌ వద్దకు వెళ్లారు. తమ పొలంలో బంగారం దొరికింది… ఆడపిల్ల వివాహం కోసం అమ్ము తున్నాం…కిలో ఉందని శాంపిల్‌గా కొంత ఇచ్చారు. దాన్ని పరిశీలించిన వినోద్‌కుమార్‌కు అసలైనదేనని తేలడంతో మిగతా బంగారాన్ని 4.5 లక్షలకు కొనుగోలు చేశాడు. దాన్ని పరిశీలించగా ఇత్తడి అని తేలింది. వారిపై చాదర్‌ఘాట్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ముగ్గురూ కలిసి మరో వ్యాపారిని మోసగించటానికి ప్రయత్నిస్తున్నట్టు తెలుసుకున్న పోలీసులు నాగరాజును పట్టుకున్నారు. అతడి వద్ద నుంచి నాలుగు లక్షల రూపాయలు, 500 గ్రాముల నకిలీ బంగారం, రెండు సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. కుమార్‌ అలియాస్‌ రాజు, మహదేవప్ప పరారీలో ఉన్నారని ఏసీపీ చెప్పారు. ఎస్‌ఐ కమల్‌కుమార్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *