తక్షణమే పద్మశాలి సమాజానికి క్షమాపణ చెప్పాలి 

బిజెపి పట్టణ అధ్యక్షులు నాగుల శ్రీనివాస్.

రాజన్న సిరిసిల్ల బ్యూరో. సెప్టెంబర్ 1 .(జనంసాక్షి). సిరిసిల్ల పద్మశాలి సమాజం పట్ల సులభంగా మాట్లాడిన బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు చక్రపాణి తక్షణమే క్షమాపణ చెప్పాలని బిజెపి పట్టణ అధ్యక్షులు నాగ శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం ఏర్పాటుచేసిన సమావేశంలో నాగ శ్రీనివాస్ మాట్లాడుతూ పద్మశాలి సమాజం పట్ల చులకనగా మాట్లాడడం బిఆర్ఎస్ నాయకులకు అలవాటైపోయిందని అన్నారు. నులి పౌర్ణమి సందర్భంగా జరిగిన శుభ యాత్రలో నూతన విగ్రహం దగ్గర పద్మశాలి సమాజాన్ని ఉద్దేశించి చక్రపాణి మాట్లాడిన తీరును తీవ్రంగా ఖండించారు. గతంలోనూ సెస్ చైర్మన్ గా ఉన్న చిక్కల రామారావు పద్మశాలి సమాజం గురించి చులకనగా మాట్లాడారాని అన్నారు. టిఆర్ఎస్ నాయకులకు పద్మశాలి సమాజం గురించి చులకనగా మాట్లాడడం అలవాటు అయిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పద్మశాలి సమాజానికి చక్రపాణి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సమావేశంలో శ్రీగాద మైసయ్య, ఎనగంటి నరేష్, గాజుల సదానందం, రాంప్రసాద్, చొప్పదండి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు