హైదరాబాద్: అకాల వర్షంతో తడిసి పోయిన ధాన్యాన్ని మద్దతు ధరతో కొనుగోలు చేయాలని సీఎల్పీ నేత జానారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 48గంటల్లో నష్టాన్ని అంచనా వేసి రైతులకు పరిహారం చెల్లించాలన్నారు. 38శాతం నష్టపోయినా పరిహారం చెల్లించాలన్నారు. మద్దతు ధరతో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను ఆదుకోవాలనా జానారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.




