Thursday, 5 November 2026

తన కొత్త బ్రాండ్ పొజిషనింగ్ ఘర్ ఆజావోను ప్రకటించిన ఐకియా

ఖైరతాబాద్ : సెప్టెంబర్ 20 (జనం సాక్షి) హైదరాబాద్, ముంబై, బెంగళూరు, నగరాల్లో ఐకియా ఇండియా భారతదేశపు మొట్టమొదటి సింక్రనైజ్డ్ ప్రొజెక్షన్లను ప్రొజెక్షన్ మ్యాపింగ్ ద్వారా శక్తివంతమైన విజువల్స్ తో నిర్వహించింది. తద్వారా అనేక మంది ప్రజలకు ఒక ప్రత్యేక సందేశాన్ని అందించింది. ఐకియా ఇటీవల భారతదేశం కోసం తన కొత్త బ్రాండ్ పొజిషనింగ్ – ఘర్ ఆ జావోను ప్రకటించింది. దీని అర్థం ఇంటికి వచ్చేయమని. దీనిద్వారా తన వినియోగ దారులతో బలమైన, లోతైన భావోద్వేగ అనుబంధాన్ని నిర్మించాలన్నది ఐకియా ఉద్దేశ్యం. ఈ అద్భుతమైన ప్రదర్శన చాలామందిని తన ఇల్లయిన ఐకియా స్టోర్లను సందర్శించడానికి ఆహ్వానించేందుకు ఎంచుకున్న ఒక మార్గం. ఐకియా ఇండియా వారి విజన్, బ్రాండ్ సమర్పణలు వారి ప్రయాణాన్ని ప్రదర్శించేలా అద్భుతంగా ఆవిష్కరించిన ఈ కార్యక్రమాన్ని పెద్ద సంఖ్యలో సందర్శకులు చూశారు. ఐకియా చాలా మందికి మెరుగైన రోజువారీ జీవితాన్ని అందించాలని విశ్వసిస్తుంది. ఈ యాక్టివేషన్ మార్కెట్లో వారి కొత్త బ్రాండ్ పొజిషనింగ్ ప్రకటన పొడిగింపు చాలామందికి సంబంధించిన ఈ బ్రాండ్, ఈ ఐకానిక్ ప్రదేశాల ద్వారా చాలా మందిని చేరుకోవడానికి, వారితో తమ సొంత ఇళ్ల పట్ల ప్రేమ, అభిరుచిని పంచుకోవడానికి ఐకియా స్టోర్లకు వారిని ఆహ్వానించడానికి ఈ కార్యక్రమం చేపట్టారు.