అల్వాల్ సర్కిల్ ఓల్డ్ అల్వాల్ లోని శ్రీ గురుదత్త పూజ స్టోర్ వద్ద నేమురి గణేష్ గౌడ్ జ్ఞాపకార్థం అల్వాల్ రైతు బజార్ వద్ద గల ఓజోన్ ఆసుపత్రి వారి సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని అన్నదాన కార్యక్రమానికీ ముఖ్యఅతిథిగా హాజరైన మల్కాజ్గిరి నియోజకవర్గం ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నేమూరి గణేష్ గౌడ్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. తన తండ్రి వర్ధంతి సందర్బంగా ఆయన జ్ఞాపకార్థం పలు సేవా కార్యక్రమాలు ప్రతి సంవత్సరం నిర్వహిస్తామని అదే తరహలో ఈసారి కూడా ఉచిత వైద్య శిబిరం పేదలకు అన్నదాన కార్యక్రమాలు చేపట్టామని అల్వాల్ టిఆర్ఎస్ పార్టీ నాయకుడు నేమూరి సాయిరాం గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక టిఆర్ఎస్ పార్టీ నాయకులు నాగేశ్వరరావు, బలవంత్ రెడ్డి, రాజసింహారెడ్డి, సూర్య కిరణ్ మధుసూదన్, బబిత, స్థానిక టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఓజోన్ ఆస్పత్రి సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
నేమూరి గణేష్ గౌడ్ జ్ఞాపకార్థంతో ఉచిత హెల్త్ క్యాంప్
అల్వాల్ (జనంసాక్షి) సెప్టెంబర్ 20




