Tuesday, 3 November 2026

తప్పు చేసినట్లు రుజువైతే ఏ శిక్షకైనా సిద్ధం: కేటీఆర్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఆంధ్రజ్యోతి పత్రికా, ఛానల్‌ చేస్తున్న తప్పుడు ఆరోపణలపై ఏ విచారణకైనా సిద్దమని, తనది తప్పని తేలితే ఏ శిక్షకైనా సిద్దమని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్‌ ప్రకటించారు. ఆరోపణలు తప్పని తేలితే ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ, ఆంధ్రజ్యోతి పత్రిక ఆరోపణలు నిజం అంటున్న టీడీపీ నాయకులు, వారిని వెనకుండి పడిపిస్తున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నా కాళ్లు పట్టుకుని క్షమాపణ చెప్పుతారా అని సవాల్‌ విసిరారు. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ బతుకు,టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు బతుకు ప్రజలకు తెలుసని పేర్కొన్నారు. సకల జనుల సమ్మెను అమ్ముకున్నారని టీఆర్‌ఎస్‌పై తప్పుడు ఆరోపణలు చేస్తున్న టీడీపీ నాయకులు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపాయుడు నాలుగు కోట్ల ప్రజల ఉద్యమం చేస్తుండగా వారి పక్షాన నిలవకుండా ఎక్కడ దాక్కున్నారని , ఎక్కడ పడుకున్నారనిఇ ప్రశ్నించారు. చీకట్లో చంద్రబాబులాగా చిదంబరంను కలవడం టీఆర్‌ఎస్‌ పార్టీకి, నాయకులును చేతగాదని, చంద్రబాబు మగాడైతే ముందుకు రావాలని డిమాండ్‌ చేశారు. ఆంధ్రజ్యోతి పత్రికా, ఛానల్‌ దాని ఎండీ రాధాకృష్ణాలపై సోమవారం పరువునష్టం దావా వేయనున్నట్లు వెల్లడించారు. చంద్రబాబు నాయుడు టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇద్దరి ఆస్తులపై విచారణకు టీఆర్‌ఎస్‌ పార్టీ సిద్దమని ఈ సవాల్‌కు టీడీపీ సిద్దమేనా అని కేటీఆర్‌ ప్రశ్నించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *