Tuesday, 3 November 2026

తప్పు చేసిన ట్రంప్ కుమారుడు..

45వ అధ్యక్షుడిగా ట్రంప్ త్వరలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే ట్రంప్ కొడుకు ఎరిక్ ట్రంప్ చేసిన ఓ తప్పిదం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బుధవారం ఓటేసిన ట్రంప్ కొడుకు ఆ దృశ్యాలను ఫోటో తీసి ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. తన తండ్రి పేరుపై ఉన్న బ్లాంక్‌ను సిరాతో నింపినట్టు ఆ ఫోటోలో స్పష్టంగా కనిపిస్తోంది. న్యూయార్క్ స్టేట్ లా ప్రకారం అలా ఓటేసిన వివరాలను screen-shot-2016-11-08-at-10-29-18-amబహిరంగపరచడం నిషేధం. అంతేకాదు, తన తండ్రికి ఓటేయడం గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు పోస్ట్ చేశాడు. అమెరికాను తన తండ్రి గొప్పగా అభివృద్ధి చేస్తాడని ట్వీట్ చేశాడు. 1890 న్యూయార్క్ లా, మార్క్ చేసిన ఎలక్షన్ బ్యాలెట్‌ను బహిరంగపరచడాన్ని నిషేధించింది. గత వారమే సోషల్ మీడియాకు కూడా ఈ లా వర్తిస్తుందని ఫెడరల్ జడ్జి తీర్పునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *