Tuesday, 3 November 2026

అమెరికా కొత్త అధ్యక్షుడిగా ట్రంప్..!

p-mpyfxఅమెరికా అధ్యక్షుడిగా రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ ఎన్నికయ్యారు. తన ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్‌పై విజయం సాధించి అమెరికాకు 45వ అధ్యక్షుడిగా ట్రంప్‌ ఎన్నికయ్యారు. ట్రంప్ జనవరి 20న వైట్ హౌజ్ ప్రవేశం చేయనున్నారు. ఆరోజు ఆయన 45వ దేశాధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. కాగా, ఈ అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ పార్టీ 276, డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ 218 స్థానాల్లో గెలుపొందిన విషయం తెలిసిందే. తాను అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైనట్టు ప్రకటించగానే ట్రంప్ మాట్లాడుతూ.. దేశాన్ని పునర్నిర్మాణం చేస్తానని అన్నారు. అమెరికా 45వ అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్విటర్ ద్వారా అభినందించారు. ప్రచార సమయంలో భారత్ గురించి చెప్పిన స్నేహపూర్వక వ్యాఖ్యలను స్వాగతిస్తున్నానని తెలిపారు. ట్రంప్ సారధ్యంలో భారత్-అమెరికా సంబంధాలు మరింత పటిష్టం కావాలని, కొత్త ఎత్తులకు వెళ్లాలని మోదీ ఆకాంక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *