Tuesday, 3 November 2026

తలసేమియా వ్యాధితో బాధపడుతున్న బాలుడికి కొండంత భరోసా

పెద్దవంగర ఆగష్టు 15(జనం సాక్షి )
తలసేమియా వ్యాధితో బాధపడుతున్న మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం రామచంద్రు తండ గ్రామానికి చెందిన రేషన్ డీలర్ జాటోత్ రమేష్ కుమారుడు ప్రేమదాన్ రాథోడ్ కు సర్పంచ్ నెమరుగొమ్ముల ప్రవీణ్ రావు కొండంత భరోసానిచ్చారు. గత సంవత్సరం మీడియా వేదికగా తన దృష్టికి తీసుకొచ్చిన బాలుడి సమస్య పట్ల ఆయన స్పందించి తన కుటుంబ సభ్యులతో కలిసి రు. 2.20 లక్ష రూపాయల చెక్కును అందజేసిన సంగతి తెలిసిందే. తాజాగా తలసేమియా వ్యాధితో బాధపడుతూ బోన్ మ్యారో ఆపరేషన్ కోసం బెంగళూరుకు పోతున్న బాలుడికి అయన కొండంత భరోసానిస్తూ ఆర్థిక పరమైన సమస్య ఉంటే అన్ని విధాలుగా ఆదుకుంటానని తెలిపారు. బాలుడు ఆపరేషన్ సక్సెస్ కావాలని క్షేమాంగ తిరిగిరావాలని ఆకాక్షించారు.