ప్రజా గాయకుడు ప్రజాయుద్ధనౌక గద్దర్ చిత్రపటానికి నివాళులర్పించిన గద్వాల ఎమ్మెల్యే
గద్వాల నడిగడ్డ, ఆగస్టు 7 (జనం సాక్షి);
గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న గద్దర్ ఆదివారం సాయంకాలం హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ప్రజా గాయకుడు ప్రజాయుద్ధనౌక గద్దర్ సోమవారం జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి నివాళులర్పించారు.ఎమ్మెల్యే మాట్లాడుతూ జన నాట్యమండలి స్థాపించి, జనం కోసం గొంతెత్తి, పాటలతో ప్రజల్లో చైతన్యం నింపిన ప్రజాగాయకుడు, ప్రజాయుద్దనౌక గద్దర్ నిష్క్రమణ తెలంగాణ సమాజానికి తీరని లోటు అని,భౌతికంగా దూరమైన గద్దర్ జ్ఞాపకాలు పాటల రూపంలో నిరంతరం ప్రజల గుండెల్లో నిలిచిపోతాయనీ ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీపిలు విజయ్, రాజారెడ్డి, జెడ్పీటీసీ రాజశేఖర్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు చక్రధర్ రావు, వెంకటన్న గౌడ్, కురుమన్న, తిమ్మప్ప, గోపి, మహేష్ నాయకులు కార్యకర్తలు యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.