తల్లిపాలు అంటేనే అమృతం – సూపర్వైజర్ శ్రీదేవి
బాల్కొండ ఆగష్టు 7( జనం సాక్షి ) తల్లిపాలు అంటేనే అమృతం అని సూపర్వైజర్ శ్రీదేవి సూచించారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా బాల్కొండ మండలం లోని మార్కండేయ మందిరం లొ సామూహిక సీమంతాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సూపర్వైజర్ శ్రీదేవి మాట్లాడుతూ… తల్లిపాలు బిడ్డకు పట్టించటం తల్లులు బాధ్యతగా తీసుకోవాలన్నారు. తల్లిపాలు వల్ల తల్లి బిడ్డ క్షేమంగా ఉంటారని తెలిపారు. పుట్టిన బిడ్డకు వెంటనే ముర్రిపాలు తాగించాలని తల్లులను ఆమె కోరారు . ముర్రిపాలు పట్టించడం ద్వారా వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది అన్నారు. తల్లిపాలు ప్రాముఖ్యతను గురించి తల్లులకు వివరించారు.ఈ కార్యక్రమంలో ఏ సి డి పి ఓ జ్యోతి , సర్పంచ్ బుస సునీత , ఏ. యన్. యం సుజాత,అంగన్వాడి టీచర్లు , ఆశ వర్కర్స్, తల్లులు పిల్లలు గర్భిణీ స్త్రీ లు బాలింతలు తదితరులు పాల్గొన్నారు.