Wednesday, 4 November 2026

తల్లిపాలు బిడ్డకు ఎంతో ఆరోగ్యకరమైనవి :కార్పొరేటర్ పసునూరి బిక్షపతి చారి

ఎల్బీ నగర్( జనం సాక్షి  ) మీర్పేట్ కార్పొరేషన్ లో 27 డివిజన్ లో గల అంగన్వాడి కేంద్రంలో *అరుణ టీచర్   ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలు , గర్భిణీ స్త్రీల శ్రీమంతం* జరపడం జరిగింది.. ఇ కార్యక్రమానికి స్థానిక కార్పొరేటర్  పసునూరి బిక్షపతి చారి పాల్గొనడం జరిగింది కార్పొరేటర్ మాట్లాడుతూ తల్లిపాలు బిడ్డకు ఎంతో ఆరోగ్యకరమైనవని. ఆ బిడ్డకు ఎదుగుదలకు. ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని. తల్లి బిడ్డకు పాలివ్వడం వలన తల్లి బిడ్డకు అనుబంధం ఏర్పడుతుందని. తల్లికి కూడా బిడ్డకు పాలు ఇవ్వడం వలన తల్లికి రొమ్ము క్యాన్సర్ రాకుండా ఉంటుందని. బిడ్డకు ఆరు నెలల వరకు తల్లిపాలు ఎంతో అవసరమని. డబ్బా పాలు ఎవరు ఇవ్వకూడదని తెలియజేశారు. అంగన్వాడి కేంద్రంలో వెయిట్ జోకే మిషన్ లేదని టీచర్ తెలియజేయగా కార్పోరేటర్ తన సొంత డబ్బులు ఇవ్వడం జరిగింది. అలాగే గర్భిణీ స్త్రీలు కూడా పోష్టిక మైన ఆహారాన్ని తీసుకోవాల్సిందిగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో. ఏఎన్ఎం  . బాలమణి . ఆశా వర్కర్ కవిత . గర్భిణీ స్త్రీలు బాలింతలు పాల్గొన్నారు.