తల్లీబిడ్డ ఆత్మహత్య..బంధువుల ఆందోళన

నిజామాబాద్‌,మే7(జ‌నం సాక్షి): నిజామబాద్‌  జిల్లాలోని ధప్పల్లి మండలం పీసీ తండాలో విషాద సంఘటన చోటు చేసుకుంది. రెండేళ్ల కుమారుడికి విషం ఇచ్చిన తల్లి తాను కూడా ఆత్మహత్య చేసుకుంది. మృతులు తల్లి లావణ్య(22), కుమారుడు అఖిల్‌(2). అత్తింటివారే చంపి ఆత్మహత్యగా చిత్రీకరించారని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. నిందితులను పట్టుకుని శిక్షించాలని గ్రామంలో ఆందోళన చేపట్టారు. ఆగ్రహంతో పక్కనే ఉన్న గుడిసెకు మృతురాలి బంధువులు నిప్పు పెట్టారు. గ్రామానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని న్యాయం చేస్తామని ఆందోళన విరమింపజేశారు. శవాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.