Wednesday, 4 November 2026

: తహశీల్దార్ కు సమ్మె నోటీసు అందజేసిన గ్రామ సేవకులు.

రాయికోడ్ జనం సాక్షి జూలై 14 రాయికోడ్ మండలంలోని తహశీల్దార్ కార్యాలయం లో మండల  గ్రామ సేవకుల సంఘం ముందస్తుగా సమ్మె నోటీసును అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామ సేవకులకు 2020లో ప్రకటించిన నూతన రెవెన్యూ చట్టం ప్రకారము ప్రభుత్వం ఇచ్చిన హామీని పే స్కేల్ ప్రమోషన్ వారసత్వ  ఉద్యోగాలు అమలు చేయాలని డిమాండ్ వ్యక్తం చేస్తూ బుధవారం నాడు మండలంలోని గ్రామ సేవకుల సంఘం తరఫున రాయికోడ్ తాసిల్దార్ రాజయ్య కు సమ్మె నోటీస్ అందించారు. గ్రామ సేవలకు ఇచ్చిన ఉద్యోగ భద్రత హామీలను అమలు చేయకపోవడంతో రాష్ట్ర జేఏసీ కమిటీ పిలుపు మేరకు ఈనెల 20, 21, 22 తేదీ లలో చలో కలెక్టరెట్  రిలే నిరాహార దీక్షలు చేపడతామని సమ్మె నోటీసులు వారు పేర్కొన్నారు. గ్రామ సేవకులు ఇచ్చిన మూడు రోజుల టైం లో ప్రభుత్వం గ్రామ సేవకులకు ఇచ్చిన హామీలను అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటిస్తే ఈనెల 25వ తేదీన నిరాహార దీక్ష ను నిలిపివేస్తామని లేనిపక్షంలో 25వ తేదీ నుండి నిరవధిక సమ్మెను కొనసాగిస్తామని రాయికోడ్ మండల గ్రామ సేవకుల సంఘం  హెచ్చరించింది. అదేవిధంగా గ్రామ సేవకులతో మారుమూల గ్రామాల్లో అనేక పనులు ప్రభుత్వ అధికారులు గ్రామ పెద్దలు చేయించుకుంటూ వారి సమస్యలను పట్టించుకోవడంలేదని వారు అందులో పేర్కొన్నారు. పల్లె గ్రామాల్లో వారసత్వ ఉద్యోగాలు ఇవ్వకపోవడంతో కుటుంబాల లకు గొడవలు జరుగుతూ ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవడం దాడులకు పాల్పడడం చేసుకుంటున్నారని ఈ విషయంలో జిల్లా కలెక్టర్ ప్రత్యేక చోరువ తీసుకొని వారసత్వ ఉద్యోగానికి గ్రామ సేవలకు ఇప్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికను పంపించాలని వారి విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా 2020లో ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని జేఏసి ఇచ్చిన పిలుపు మేరకు రాయికోడ్ లో గ్రామ సేవకుల సంఘం తరఫున సమ్మె నోటీసు ఇవ్వడం జరిగిందని గ్రామ సేవకుల సంఘం అధ్యక్షుడు . రత్నం పేర్కొన్నారు. ఈ సమ్మె నోటీసు ఇచ్చిన వారిలో గ్రామ సేవకుల సంఘం రాయికోడ్ మండల అధ్యక్షులు జి.పి. రత్నం, ఉపాధ్యక్షులు శివకుమార్, కార్యదర్శి .శ్రీశైలం, సలహాదారు గోపాల్, కోశాధికారి S.లక్ష్మీ, అశోక్, భూమన్న, నహీం, శమయ్య, వీరేందర్, బాల్ రాజ్,  నర్సింలు, మణయ్య, . లక్ష్మీ, సుజాత, భాగ్యవతి, . విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు…